అమెరికాలోని వర్జీనియాలో ఇకపై అధికారికంగా దీపావళి
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఇకపై దీపావళి పండుగను అధికారికంగా జరుపుకోనున్నారు. అక్టోబరు నెలలోని ఆఖరి శనివారాన్ని ఇకపై దీపావళి దినోత్సవంగా పరిగణిస్తారు. ఈ బిల్లును హౌస్ ఆఫ్ డెలిగేట్స్ లో ప్రతిపాదించగా... దాన్ని అక్కడి ప్రతినిధులతో పాటు సెనేట్ కూడా ఆమోదించింది. దీనిపై ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, మేరీల్యాండ్ లోనూ దీపావళిని అధికారికంగా జరుపుకునేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్రురాలు అరుణా మిల్లర్ కృషి చేస్తున్నారు.